పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 58కి చేరింది. ఇవాళ ఏలూరులో ఒకటి, పెనుగొండలో మరొకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కొవిడ్ ఆస్పత్రి నుంచి ఏడుగురు కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఏలూరులో ఇద్దరు, తాడేపల్లిగూడెం ఇద్దరు, పెనుగొండకు చెందిన ముగ్గురు వ్యాధి నుంచి కోలుకొని ఇంటికి వెళ్లారు. జిల్లాలో మొత్తం 26 మంది కరోనా బాధితులు కోలుకొన్నారు. ప్రస్తుతం 32 మంది ఏలూరు కొవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కేసులు నమోదు ఇలా
ఏలూరు | 18 |
పెనుగొండ | 16 |
తాడేపల్లిగూడెం | 5 |
భీమవరం | 5 |
పోలవరం | 3 |
గుండుగొలుసు | 3 |
కొవ్వూరు | 2 |
ఉండి | 2 |
అకివీడు | 1 |
నరసాపురం | 1 |
గోపాలపురం | 1 |
టీ నరసాపురం | 1 |
ఏలూరు18, పెనుగొండ16, తాడేపల్లిగూడెం5, భీమవరం5, పోలవరం3, గుండుగొలను3, కొవ్వూరు2, ఉండి2, ఆకివీడు1, నరసాపురం1, గోపాలపురం1, టీ. నరసాపురం1 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి..