యువకుడి వేధింపులతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తేతలిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తణుకులో విద్యార్థిని డిగ్రీ చదువుతోంది. తేతలి గ్రామానికి చెందిన ఓ యువకుని ఆటోలో కళాశాలకు వెళ్లేందుకు తల్లిదండ్రులు ఏర్పాటు చేశారు. అక్కడే అసలు సమస్య వస్తుందని వారు ఊహించలేకపోయారు.
ఆటోడ్రైవర్ తమ్ముడు ఏసురత్నం ఈమెని బయట, ఫోనులో వేధించటం ప్రారంభించాడు. అయితే తనని ఇబ్బందిపెట్టొద్దని... అలా చేస్తే బలవన్మరణానికి పాల్పడతానని ఆమె పలుమార్లు హెచ్చరించింది. కాని ఆ యువకుడు పట్టించుకోలేదు. ఇంట్లో తల్లిదండ్రులకు చెబితే చదువు మాన్పిస్తారనో... మరే ఇతర భయంతోనో కొద్దికాలం భరిస్తూ వచ్చింది.
చివరికి ఈ నెల 8వ తేదీన ఆ విద్యార్థిని నిద్రమాత్రులు మింగి బలవన్మరణానికి పాల్పడింది. దహన సంస్కారాలు పూర్తైన తర్వాత ఆమె సెల్ఫోన్ పరిశీలించినప్పుడు తల్లిదండ్రులు ఈ విషయం తెలుసుకొని బోరుమన్నారు. యువకుడి చర్యల వల్లే తన కూతురు మరణించిందని మృతురాలి తండ్రి ఆరోపించారు.
ఇదీ చదవండి :