ETV Bharat / state

కొబ్బరి రైతులపై కరోనా పంజా

author img

By

Published : Apr 20, 2021, 5:35 PM IST

కరోనా ప్రభావం రైతులను కష్టాల ఊబీలోకి లాగింది. కరోనా రెండో దశ వ్యాప్తి కారణంగా.. రాష్ట్రంలోని దేవాలయాలు మూతపడ్డాయి. దీంతో కొబ్బరి రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. పశ్చమగోదావరి జిల్లాలో సుమారు 40వేల ఎకరాల్లో వేసిన కొబ్బరి పంటకు గిట్టుబాటు ధర రాక.. తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు.

coconut farmers lossed due to corona affect in west godavari
కొబ్బరి రైతులపై కరోనా పంజా
కొబ్బరి రైతులపై కరోనా పంజా

కరోనా ప్రభావం రైతులను తీవ్ర నష్టాల్లోకి నెట్టింది. మొదటిసారి వచ్చినప్పుడు నష్టాలకు గురైన రైతులు తిరిగి రెండోసారి ప్రారంభం కావడంతో మరింత సంక్షోభానికి కారణమవుతోంది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దేవాలయాలు మూత పడటంతో కొబ్బరి రైతులకు నిరాశే మిగిలింది. ఎగుమతులు తగ్గిపోవడంతో.. ధరలు తగ్గిపోయి నష్టాల పాలవుతున్నారు. మరోవైపు ఎరువుల ధరలు పెరిగిపోవడంతో రైతులకు మరింత భారంగా మారింది.

సుమారు 40 వేల ఎకరాల్లో కొబ్బరి పంట

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధానంగా పండించే వాణిజ్య పంటల్లో.. కొబ్బరి ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 40 వేల ఎకరాల్లో కొబ్బరి పంట సాగు చేస్తున్నారు. ఎకరానికి సుమారు 60 మొక్కలు వేస్తారు. ప్రస్తుతం కొబ్బరి చెట్లకు నల్లి పురుగు ప్రభావం ఎక్కువగా ఉండడంతో దిగుబడులు తగ్గిపోయాయి. ఎకరానికి 2వేల నుంచి 2500 వరకు కాయల దిగుబడి వస్తున్నాయి. నల్లి పురుగు ప్రభావంతో కాయల సైజు తగ్గిపోవడంతో రైతులు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రస్తుతం వ్యాపారులు కొబ్బరి కాయలు రూ.6కు కొనుగోలు చేస్తున్నారు. కొబ్బరికాయలు సైజు తక్కువగా ఉండటంతో 10 నుంచి 20 కాయలను ప్రతి 100 కాయలకు అదనంగా తీసుకుంటున్నారు. ఎరువుల ధరలు కూడా పెరిగిపోవడం వల్ల నష్టపోతున్నామని.. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురుగుల నివారణకు ఉద్యానవన శాఖ ద్వారా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మార్కెట్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి.. కొబ్బరికాయ కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

కరోనా కొబ్బరి ఎగుమతులపై ప్రభావం చూపుతుందని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో నెలకు జిల్లా నుంచి 500 పైగా లారీలు కొబ్బరికాయలు ఎగుమతి అయితే ప్రస్తుతం 150 లారీలు ఎగుమతి కావడం కష్టంగా ఉందని వివరిస్తున్నారు. కరోనా ప్రభావంతో వివిధ రాష్ట్రాల్లో దేవాలయాలు మూతపడటం వల్ల వ్యాపారం దిగజారి పోయిందని అంటున్నారు.

ఇదీ చదవండి:

ఆన్​లైన్​ క్రికెట్​ బెట్టింగ్​ రాయుళ్లు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.