ETV Bharat / state

కేటీఆర్‌ ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా ఊచలు లెక్కపెట్టాల్సిందే : రేవంత్ - TELANGANA CM REVANTH REDDY COMMENTS

కేటీఆర్‌ ఉరుకులాటను గమనిస్తూనే ఉన్నానన్న రేవంత్‌రెడ్డి - కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలని, 80 వేల పుస్తకాల్లో ఏం చదివారో మాట్లాడదామని సవాల్

Revanth_Reddy
Revanth Reddy (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 20, 2024, 6:55 PM IST

Telangana CM Revanth Reddy Public Meeting : మాజీ సీఎం కేసీఆర్​ అసెంబ్లీకి రావాలని, 80 వేల పుస్తకాల్లో ఏం చదివారో చెప్పాలని తెలంగాణ సీఎం రేవంత్​ రెడ్డి సవాల్​ విసిరారు. ప్రజలనే కాదని వేములవాడ రాజన్నను సైతం కేసీఆర్​ మోసం చేశారని ఆరోపించారు. కేసీఆర్​ను గద్దె దించాలని సిరిసిల్ల పాదయాత్రలో నిర్ణయించుకున్నానని తెలిపారు. ఇవాళ వేములవాడలో నిర్వహించిన ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్​పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

కేటీఆర్‌ ఎంతదూరం ఉరుకుతారో చూస్తా: తన నియోజకవర్గంపై కేసీఆర్‌కు ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు. తానేమీ లక్ష ఎకరాలు సేకరించలేదని, తాను సేకరిస్తానన్నది 4 గ్రామాల్లో 1100 ఎకరాలు మాత్రమే అని తెలిపారు. 1100 ఎకరాల భూసేకరణ ప్రపంచ సమస్య అయిందా అని నిలదీశారు. కేటీఆర్‌ దిల్లీకి వెళ్లి నాపై ఫిర్యాదులు చేస్తున్నారని, కేటీఆర్‌ ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా ఊచలు లెక్కపెట్టాల్సిందే అని హెచ్చరించారు. లగచర్లలో భూసేకరణపై కుట్ర చేసినందుకు కేటీఆర్‌ ఊచలు లెక్కపెడతారని అన్నారు. కేటీఆర్‌ ఉరుకులాటను గమనిస్తూనే ఉన్నానన్న రేవంత్‌రెడ్డి, ఎంతదూరం ఉరుకుతారో తానూ చూస్తానని అన్నారు.

త్వరలోనే మిడ్​ మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని రేవంత్​ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో వాయిదా పడుతున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి మంత్రి ఉత్తమ్​ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈనెల 30న మరోసారి ఉత్తమ్​కుమార్​రెడ్డి ఇక్కడికి వచ్చి ప్రాజెక్టులపై సమీక్షిస్తారని వెల్లడించారు.

జనవరి నుంచి ముఖ్యమంత్రి పాదయాత్ర - అక్కడి నుంచే ప్రారంభం

దేశానికి ప్రధానిని ఇచ్చిన గడ్డ ఇది: దేశానికి ప్రధానిని అందించిన గడ్డ కరీంనగర్​ అని, పరిపాలన ఎలా ఉంటుందో దేశానికి చూపిన తెలంగాణ బిడ్డ పీవీ నరసింహరావు అని రేవంత్ కొనియాడారు. తెలంగాణ ఇస్తామని సోనియాగాంధీ ఇక్కడి నుంచే ప్రకటన చేశారని గుర్తు చేశారు. తెలంగాణ బిల్లును ఆమోదింపజేయడంలో జైపాల్​ రెడ్డి కీలకపాత్ర పోషించారన్నారు. కాంగ్రెస్​ పార్టీ మాట ఇస్తే ఎంత దూరమైనా వెళుతుందని స్పష్టం చేశారు. ఎంపీగా పొన్నం ప్రభాకర్​ను గెలిపిస్తే తెలంగాణను తీసుకువచ్చారన్నారు. అదే బండి సంజయ్​ను గెలిపిస్తే కేంద్రం నుంచి కరీంనగర్​కు ఏం తెచ్చారని ప్రశ్నించారు. బీఆర్​ఎస్​ ఎంపీలు కూడా కరీంనగర్​కు ఏం చేయలేదని విమర్శించారు.

బీఆర్​ఎస్​ నేతల మైండ్​ పోయింది: 'మీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ వేములవాడ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఎప్పుడు నన్ను కలవడానికి వచ్చినా చేతినిండా దస్త్రాలు తీసుకువస్తారు. ఈ ప్రాంతంలోని నేతన్నలు, గల్ఫ్‌ కార్మికులను ఆదుకోవడమే మా ప్రాధాన్యం. కరీంనగర్‌లో గల్ఫ్‌ బోర్డు పెట్టాలని ఆది శ్రీనివాస్‌ అడిగారు. గల్ఫ్‌లో తెలంగాణ వాసులు మరణిస్తే రూ.5 లక్షల పరిహారం ఇస్తున్నాం. ఈ ప్రాంతంలో వలసలు ఎక్కువ. పదేళ్లలో కేసీఆర్​ చేయలేని పనులను పూర్తి చేస్తున్నాం. కేసీఆర్​ ఫాంహౌస్​లో పడుకుంటారు. కేటీఆర్​, హరీశ్​రావు మన కాళ్ల మధ్యలో కట్టేలు పెడుతున్నారు. అధికారం పోయేసరికి బీఆర్​ఎస్​ నేతలకు మైండ్​ పోయింది.' అని రేవంత్​ రెడ్డి ధ్వజమెత్తారు.

రేవంత్‌రెడ్డి మరో సంచలన నిర్ణయం - యాదాద్రి పేరు మార్పు

మీ నొప్పికి మా కార్యకర్తల దగ్గర మందు ఉంది: బీఆర్​ఎస్​ సరిగా పాలన చేసి ఉంటే రైతు రుణమాఫీ చేయాల్సి వచ్చేదా అంటూ రేవంత్​ రెడ్డి ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని, అది కేసీఆర్​ వల్ల కాదా అంటూ మరోసారి ప్రశ్నించారు. రూ.11 వేల కోట్ల రుణమాఫీకి కేసీఆర్​ ఐదేళ్లు తీసుకున్నారు. కానీ తమ ప్రభుత్వం 25 రోజుల్లోనే 23 లక్షల కుటుంబాలుకు రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. రుణమాఫీని అభినందించాల్సింది పోయి విమర్శిస్తారా అంటూ దుయ్యబట్టారు. పదేళ్లలో మీరు చేయలేని పని మేము చేస్తుంటే మీకు నొప్పి ఎందుకని అడిగారు. మీ నొప్పికి మా కార్యకర్తల దగ్గర మందు ఉందని, త్వరలోనే పెడతారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ సంగతి తేలుస్తామన్నారు.

మీరు చేసిన రుణమాఫీ, మేము చేసిన రుణమాఫీ వివరాలు బయటకు తీసి చర్చకు పెడదామని రేవంత్​ రెడ్డి సవాల్​ విసిరారు. కేసీఆర్​ అసెంబ్లీకి వస్తే రుణమాఫీ లెక్కలు తీసి చూపిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన 11 నెలల్లోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని, ఉద్యోగాలు వచ్చిన వారిని పిలుస్తామని లెక్కపెట్టుకోండని సవాల్​ విసిరారు. కొత్తగా ఉద్యోగాలు వచ్చినవారు 50 వేల మంది కంటే తక్కువ ఉంటే క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు.

సచివాలయంపై వాస్తు ఎఫెక్ట్​ - 'బాహుబలి' గేటు మూసివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.