పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో.. అంతు చిక్కని సమస్యతో అస్వస్థతకు గురైన వారిని ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందుతున్న తీరును తెలుసుకున్నారు. బాధితులకు ధైర్యం చెప్పారు. వారు పడిన ఇబ్బందులను తెలుసుకున్నారు.
ప్రసూతి, శిశు ఆరోగ్య కేంద్రం వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఈ విషయమై.. ముఖ్యమంత్రి జగన్.. అధికారులతో సమావేశం కానున్నారు. వ్యాధి కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై అయన అధికారులతో చర్చించనున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల పరామర్శ అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఐసీఎంఆర్ సహా మరో నాలుగు కేంద్ర బృందాలు.. ఏలూరు వస్తున్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. దిల్లీ ఎయిమ్స్ కు ఇప్పటికే శాంపిల్స్ పంపామని... ప్రాథమికంగా నీటి పరీక్షల్లో ఎటువంటి ఇబ్బందులూ కనిపించలేదని పేర్కొన్నారు. రక్తపరీక్ష ఫలితాలు కూడా సాధారణంగానే వస్తున్నాయన్నారు. అన్ని వైరస్ టెస్ట్‌లు నిర్వహించామని..అన్ని నెగెటివ్‌గా వచ్చాయని సీఎంకు వివరించారు.
ఇదీ చూడండి: