ETV Bharat / state

ప్రశాంతంగా నిద్రించే పరిస్థితి కూడా లేదు: చంద్రబాబు - Chandrababu west godavari tour news

వైకాపా ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ఇళ్లలో ఆనందంగా నిద్రపోయే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టప్రకారం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

Chandrababu Fires on Jagan Over Attacks on TDP Cadre

author img

By

Published : Jan 22, 2021, 5:20 AM IST

వైకాపా పాలనలో ఇళ్లలో ఆనందంగా నిద్రపోయే పరిస్థితి కూడా లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పోలీసులు తమ స్థాయిని దిగజార్చుకుంటున్నారని మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన చంద్రబాబు... మాజీమంత్రి పితాని సత్యనారాయణ, మాజీఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఇళ్లలో శుభకార్యాల్లో పాల్గొన్నారు. నూతనంగా వివాహం చేసుకున్న నవ దంపతులను ఆశీర్వదించారు. 20 నెలల వైకాపా పాలనలో తెలుగుదేశం పార్టీపైన 1350 దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం ఉందని ఇష్టానుసారం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

ఇదీ చదవండీ... పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.