పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలోని సిలికా సిరామిక్స్ పరిశ్రమలో పనిచేసే వివిధ రాష్ట్రాలకు చెందిన 147 మంది ఒప్పంద కార్మికులు సోమవారం పరిశ్రమ ఎదుట ఆందోళన చేపట్టారు. తాము పని చేసిన నెలలకు జీతాలు ఇచ్చి... స్వస్థలాలకు వెళ్లడానికి ఏర్పాటు చేయాలని పరిశ్రమ ఎదుట నిరసన తెలిపారు. సమాచారం తెలుసుకున్న చేబ్రోలు ఎస్సై వీర్రాజు పరిశ్రమకు చేరుకుని నిరసనకారులు, పరిశ్రమ సిబ్బందితో మాట్లాడారు. ఈనెల 15వ తేదీన జీతాలు ఇచ్చేందుకు పరిశ్రమ యాజమాన్యం ఒప్పుకుంది. ఒప్పంద కార్మికులను తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడం వల్ల ఒప్పంద కార్మికులు ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి :