Central on new railway zone Works: రాష్ట్ర వాటాతో చేపట్టిన అన్ని రైల్వే ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ నిధులు ఇవ్వడం ఆపేసిందని కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి రావ్‌సాహెబ్ పాటిల్ దన్వే వెల్లడించారు. మూడేళ్ల క్రితం ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వేజోన్‌పై ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించిందని,. అతిత్వరలో పని ప్రారంభమవుతుందని మంత్రి స్పష్టంచేశారు. కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్, రైల్వేజోన్‌ల గురించి బుధవారం లోక్‌సభలో తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ మేరకు బదులిచ్చారు. ‘‘కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్ అమలాపురం ప్రాంతానికి చాలా ముఖ్యం. లోక్‌సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి కల ఇది. ఆయన కృషి ఫలితంగానే 20 ఏళ్ల క్రితం మంజూరైంది. దీనికి రాష్ట్రవాటాగా రూ.360 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.2.70 కోట్లే ఇచ్చారు. ఇలాంటి ప్రాజెక్టులను అలాగే వదిలేస్తారా? కేంద్రం ఆదుకుంటుందా’ అని రామ్మోహన్‌నాయుడు అడిగారు. మంత్రి బదులిస్తూ ‘‘57.21 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమైనది. బాలయోగి కలల ప్రాజెక్టు అన్నదీ నిజమే. దీనికి రూ.2,120 కోట్లు అవసరం. ఇప్పటివరకు రూ.1,048 కోట్లు ఖర్చయింది. రాష్ట్రవాటాగా రూ.357.96 కోట్లు రావాల్సి ఉండగా రూ.2.69కోట్లే వచ్చింది. రాష్ట్రం డబ్బులు ఇవ్వడం బంద్ చేసింది. ఇదొక్కటేకాదు రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి ప్రాజెక్టులకూ ఏపీ నిధులు ఇవ్వడంలేదు. ఏపీలో చేపట్టిన రైల్వే ప్రాజెక్టులకు 2021-22లో రూ.6,223 కోట్లు కేటాయించాం. 2009-14 సంవత్సరాల్లో యేటా సగటున జరిపిన రూ.886 కోట్ల కేటాయింపులతో పోలిస్తే ఇది 602% అధికం’’ అని వివరించారు. రాజమండ్రి ఎంపీ మార్గానిభరత్ మాట్లాడుతూ అశాస్త్రీయ విభజన కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రం వద్ద నిధులు లేనందున రాష్ట్రంలో చేపట్టే రైల్వే ప్రాజెక్టుల వ్యయాన్ని కేంద్రమే 100% భరించేలా అంచనాలను సవరించాలని కోరగా కేంద్రమంత్రి సాధ్యంకాదన్నారు.
ఇదే సమయంలో స్పందించిన వైకాపా ఎంపీ మార్గాని భరత్.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రానప్పుడు తాము ఎలా నిధులు ఇవ్వగలమని ప్రశ్నించారు.
ఇదీ చదవండి:
PRC Steering Committee: 'మేం సమ్మెను విరమించుకున్నాం.. మీరు చేయవచ్చు కదా..?