కేంద్రం నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు దెందులూరు మండలంలో పర్యటించారు. గ్రామంలోని రైతులతో మాట్లాడి పొలాల్లో ఉపయోగించే పురుగుల మందుల గురించి తెలుసుకున్నారు. ఏలూరులో పంటలకు వాడే రసాయన ఎరువులను పరిశీలించారు. ఖరీఫ్ సీజన్లో వాడిన క్రిమిసంహారకాల గురించి స్థానిక మందుల దుకాణంలో వివరాలు అడిగి తెలుసుకున్నారు. పట్టణానికి అందించే తాగునీటి వనరులను పరీక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: అంతుచిక్కని వింత వ్యాధి..ఏలూరులో కొనసాగుతున్న పరిశోధనలు