ETV Bharat / state

ఇకపై మధ్యాహ్న భోజనం.. మరింత 'ప్రియం'! - midday meals in government school news

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ధరలను 10.99 శాతం పెంచుతూ కేంద్ర మానవ వనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి పెంపు వర్తిస్తుందని పేర్కొంది.

midday meals rate
మధ్యాహ్న భోజనం ధర పెంచిన కేంద్రం
author img

By

Published : Apr 27, 2020, 5:17 PM IST

పశ్చిమ గోదావరి జిల్లాలోని 3,270 పాఠశాలల్లో 2.67 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం పథకంలో నమోదయ్యారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థుల మధ్యాహ్న భోజన తయారీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తున్నాయి. ఇందులో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం భరిస్తున్నాయి. 9, 10 తరగతులకు నూరు శాతం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. 2018-19 నుంచి 2019-20 వరకు ఏటా ధరలు పెంచుతున్నాయి. 2019-20 జనవరిలో ‘గోరుముద్ద’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనం మెనూ పెంచడంతో పాటు స్వల్ప మార్పులు చేసింది. ఆ మేరకు ఈ ఏడాది జనవరిలో ధరలను పెంచింది.

ఇంటికే సరకులు

జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో 97 శాతం, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 77, ఉన్నత పాఠశాలల్లో 77, ప్రత్యేక పాఠశాలల్లో 100 శాతం విద్యార్థులు బడి భోజనం చేస్తున్నారు. మార్చి 19 నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో అప్పటి నుంచి ఏప్రిల్‌ 23వ తేదీ వరకు మధ్యాహ్న భోజన సరకులను విద్యార్థుల ఇంటికే అందించారు.

మార్గదర్శకాలు అందాల్సి ఉంది

మధ్యాహ్న భోజనానికి అదనపు కేటాయింపులు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందాల్సి ఉంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఉత్తర్వులు అందిన వెంటనే ధరల పెంపు వర్తిస్తుంది. - సీవీ రేణుక, జిల్లా విద్యాశాఖాధికారిణి

ఇవీ చూడండి:

మూడో విడత రేషన్... బయోమెట్రిక్ తప్పనిసరి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.