పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం విజ్జేశ్వరం వద్ద ప్రమాదం జరిగింది. రహదారి పక్కన ఉన్న రాతిదిమ్మెను ఢీకొని కారు కాల్వలోకి దూసుకెళ్లింది. కాల్వ లోతుగా ఉండటంతో కారు నీట మునిగింది. అయితే వాహనంలో ఎంతమంది చిక్కుకున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కాల్వలో గాలిస్తున్నారు.
ఇదీ చదవండీ...