ETV Bharat / state

హమీలేని రుణాలంటూ మోసం.. లబోదిబోమంటున్న బాధితులు - cheating

ఎటువంటి హామీ లేకుండా ప్రతి మహిళకు 50 వేల రూపాయలు రుణం ఇస్తామంటూ కొందరు వ్యక్తులు భారీ మోసానికి తెరలేపారు. సభ్యత్వ, బీమా రూసుములంటూ ఒక్కో మహిళ వద్ద రూ.3 వేలు వసూలు చేశారు.

bvm-company-cheating-women
author img

By

Published : Aug 3, 2019, 1:57 PM IST

హమీ లేని రుణాలంటూ మోసం చేసిన ఫైనాన్స్‌ సంస్థ

విజయదుర్గ హోమ్ ఫైనాన్స్‌ సంస్థకు చెందిన వ్యక్తులమంటూ కొందరు నెల రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం విస్సాకోడేరుకు వెళ్లారు. హామీ లేకుండానే 50 వేల రూపాయలు రుణాలిస్తామని నమ్మబలికారు. అందుకు ఆధార్‌, రేషన్‌ కార్డుల నకళ్లతోపాటు సభ్యత్వం కోసం 15 వందల రూపాయలు చెల్లించాలని చెప్పారు. అలా చెల్లించిన వారికి ఒక ఎలక్ట్రికల్‌ కుక్కర్‌ను అందించారు.

రుణం మంజూరు కావాలంటే ఇన్సూరెన్స్ కోసం మరో 15 వందల రూపాయలు చెల్లించాలన్నారు. ఇలా విస్సాకోడేరులో సుమారు 200 మంది మహిళల నుంచి ఒక్కొక్కరి వద్ద 3 వేల రూపాయల చొప్పున వసూలు చేసి పత్తా లేకుండా పోయారు. వారిచ్చిన ఫోన్ నెంబర్లు కూడా పని చేయకపోవడంతో బాధిత మహిళలు లబోదిబోమన్నారు. వారిచ్చిన చిరునామా సైతం తప్పని తేలింది. విస్సాకోడేరుతోపాటు భీమవరం, పాలకోడేరు, వీరవాసరం తదితర ప్రాంతాల్లో కూడా ఈ ముఠా ఇదే తరహా మోసానికి పాల్పడినట్లు బాధితులు చెబుతున్నారు. పేదల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Intro:AP_NLR_01_03_MIN_ANIL_SUBTESATION_SANKUSTAPANA_RAJA_AP10134
anc
ఆక్వా రైతులకు యూనిట్ 2 రూపాయల నుంచి ఒకటిన్నర రూపాయికి తగ్గిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. నెల్లూరు నగరంలోని కొండాయపాలెంలో రెండు కోట్ల రూపాయలతో చేపడుతున్న విద్యుత్ కేంద్రానికి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ శంకుస్థాపన చేశారు. నెల్లూరు నగర, గ్రామీణ ప్రజలకు కరంటు ఇబ్బందులు లేకుండా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రైతులకు పగటిపూట 9 గంటల కరెంటు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అతి త్వరలో 9 గంటల కరెంటు ఇస్తామని మంత్రి తెలియజేశారు. రాష్ట్రం 3 లక్షల 60 వేల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని, అయినా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని మంత్రి తెలిపారు.
బైట్, అనిల్ కుమార్ యాదవ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి

Body:అనిల్ కుమార్ యాదవ్

Conclusion:బి రాజా నెల్లూరు 9394550293

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.