పశ్చిమ గోదావరి జిల్లాలో టిడ్కో గృహప్రవేశాలకు సిద్ధమైన లబ్ధిదారులు అరెస్టు అయ్యారు. లబ్ధిదారులతో గృహప్రవేశాల చేయించేందుకు సీపీఐ నాయకులు సిద్ధమయ్యారు. ఏలూరు, పాలకొల్లు, నరసాపురం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో పోలీసులు ఉదయం నుంచే వారిని గృహ నిర్బంధం చేశారు.
టిడ్కో లబ్దిదారులతో గృహప్రవేశాల చేయించేందుకు నాయకులు సిద్ధమయ్యారు. దీంతో ఈ రోజు ఉదయం నుంచే సీపీఐ నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. టిడ్కో గృహాల వద్దకు వెళ్తున్న లబ్ధిదారులను కూడా అరెస్టు చేశారు. ఏలూరులో జిల్లా సీపీఐ నాయకులను రాత్రి నుంచే పోలీసులు గృహనిర్బంధం చేశారు. గృహ ప్రవేశాలు చేస్తున్న లబ్ధిదారులను అరెస్టు చేయడం హేయమైన చర్య అని సీపీఐ నాయకులు అన్నారు.
ఇదీ చదవండి: