పశ్చిమగోదావరి జిల్లా గోదావరి నుంచి మూడు డెల్టాలకు 9,800 క్యూసెక్కుల సాగునీరు విడుదల చేశారు. పశ్చిమడెల్టాకు 5 వేలు, తూర్పుడెల్టాకు 3 వేలు, మధ్య డెల్టాకు 1,800 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఏలూరు కాలువకు 737, ఉండి కాలువకు 876 , జీఅండ్‌వీ కాలువకు 673, అత్తిలి కాలువలోకి 431 ,నరసాపురం కాలువకు 1,704 క్యూసెక్కుల సాగునీటిని అధికారులు విడుదల చేశారు.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి గోదావరికి భారీగా వరద ప్రవాహం చేరుతోంది. ఉదయం 8 గంటలకు గోదావరి నీటిమట్టం40.70 అడుగులకు చేరింది. 10 గంటలకు 41 అడుగుల వద్ద ఉంది. గోదావరిలో 7,72,359 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది.
ఇదీ చూడండి. ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు