పశ్చిమగోదావరి జిల్లాలో ఐదు పట్టణాల్లో పదో తేదీన స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఐదు పట్టణాల్లో 161 వార్డులుండగా...19 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 142 వార్డులకు 441 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఏలూరు కార్పొరేషన్, నర్సాపురం పట్టణంలో మూడేసి వార్డులు ఏకగ్రీవం కాగా.. కొవ్వూరు పట్టణంలో 13 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవమైన 19 వార్డులలో 15 వార్డులను వైకాపా, నాలుగు వార్డులను తెదేపా అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఎన్నికలు సజావుగా సాగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
నిడదవోలు పురపాలక సంఘంలో 28 వార్డుల్లో 91 మంది అభ్యర్థులు పోటీలో మిగిలారు. వాటిలో 10 వార్డులలో ముఖాముఖి పోటీ నెలకొంది. ఏడు, 20వ వార్డులో గరిష్ఠంగా ఆరుగురు పోటీలో నిలిచారు.
పోటీ చేసే వారి లెక్క తేలటంతో అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. పార్టీలకు చెందిన నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు తమ అభ్యర్థులకు మద్దతుగా రంగంలో దిగారు. గెలుపే ప్రాతిపదికగా వ్యూహాలను రూపొందించుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఇదీ చదవండి