పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు రోజుల క్రితం సంచలనం సృష్టించిన రహస్య శృంగార వీడియోలు కేసులో ప్రధాన నిందితుడు అగ్గి శెట్టి సాయి భరత్ కుమార్ పోలీసులు అరెస్ట్ చేశారు . నిందితుడు అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో తన సెల్‌ఫోన్ దుకాణానికి వచ్చే మహిళలను అస్యభకరంగా వీడియో చిత్రీకరించాడు. అనంతరం గోపినాథ్, సత్తిబాబు, కటికల బాబు అనే తన ముగ్గురు స్నేహితల ద్వారా వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఉంచుతామని సదరు మహిళలను బెదిరించేవారు. వారు డబ్బు ఇవ్వకపోయే సరికి వీడియోలను వాట్సప్ ద్వారా వైరల్ చేసినట్లు నరసాపురం డీఎస్పీ స్పష్టం చేశారు. ప్రధాన నిందితుడు సాయి భరత్‌ను అదుపులోకి తీసుకోగా మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
ఇదీచదవండి