ETV Bharat / state

రైతుల వద్ద లంచం... ఏఎంవీఐపై సస్పెన్షన్ వేటు - పశ్చిమగోదావరి జిల్లా వార్తలు

చెరకు రైతుల వద్ద చేయి చాపినందుకు ఏలూరు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్​స్పెక్టర్ లోకనాథ ప్రసాద్​పై సస్పెన్షన్ వేటు పడింది. రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఆదేశాలతో విచారణ చేపట్టిన అధికారులు... ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

AMVI
AMVI
author img

By

Published : Dec 25, 2020, 11:42 AM IST

చెరకు రైతుల నుంచి లంచాలు వసూలు చేసినందుకు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్​స్పెక్టర్ లోకనాథ ప్రసాద్​పై వేటు పడింది. చెరకు రవాణా వాహనదారుల నుంచి రవాణా శాఖ అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆ శాఖ మంత్రి పేర్ని నానికి కృష్ణా జిల్లా బాపులపాడు మండలానికి చెందిన రైతులు ఫిర్యాదు చేశారు. తాము పండించిన చెరకును పశ్చిమగోదావరి జిల్లాలోని ఆంధ్రా సుగర్స్ ఫ్యాక్టరీకి ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తామని... మార్గమధ్యంలోని కలపర్రు టోల్ గేట్ వద్ద ఆర్టీవో అధికారులు లంచాలు అడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో ట్రాక్టర్​కు 500 రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులో తెలిపారు. ఇదేమని అడిగితే ఏవేవో కారణాలు చూపుతూ బలవంతంగా డబ్బు తీసుకుంటున్నారని... చెల్లించకపోతే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని మంత్రి దృష్టికి తెచ్చారు.

రైతుల ఫిర్యాదుపై స్పందించిన మంత్రి... బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. విచారణ జరిపి డీటీసీ కార్యాలయంలో పని చేస్తున్న ఏఎంవీఐ లోకనాథ ప్రసాద్​ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ రవాణాశాఖ కమిషనర్ ఉత్తర్వులిచ్చారు.

ఇదీ చదవండి

'నా కూతురిని వాళ్లే హత్య చేశారు..న్యాయం చేయండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.