ETV Bharat / state

108 వాహనాలకు.. సిబ్బందికి.. గూడు కరువాయే.. - పశ్చిమగోదావరిలో అంబులెన్స్ సిబ్బందికి కనీస వసతులు కరవు

ప్రజలు అనారోగ్యానికి గురైన వెంటనే తక్షణం గుర్తొచ్చేది అంబులెన్స్​. అటువంటి 108 వాహనాలను ఉంచేందుకు స్థలం లేకపోవడం.. శోచనీయం. వాహనాలు ఎండలో ఎండి.. వానలో తడిసి.. కొద్దిరోజులకే చెడిపోతున్నాయి. అలాగే వీటిని నడిపుతున్న డ్రైవర్లకు కనీస వసతులు లేకపోవడం.. అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

Ambulance crews no basic facilities in West Godavari district
108 వాహనాలకు.. సిబ్బందికి.. గూడు కరువాయే..
author img

By

Published : Jan 3, 2021, 9:37 PM IST

అనారోగ్య సమయంలో టక్కున గుర్తుకొచ్చేది 108 వాహనం. సమాచారం అందిన వెంటనే వచ్చి ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తుంది. కానీ అంబులెన్స్​లకు, అందులో పనిచేసే సిబ్బందికి కనీస వసతులు లేకపోవడం పట్ల తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్న అంబులెన్సుల నిర్వహణ కోసం ప్రభుత్వం సరైన వసతులను ఏర్పాటు చేయడం లేదు. ఫలితంగా రంగులు వెలిసిపోయి, తుప్పు పట్టి మరమ్మతులకు గురవుతున్నాయి. కొద్దికాలానికే ఈ వాహనాలు దెబ్బతింటున్నాయి. ఈ క్రమంలో అత్యవసర సేవలకు విఘాతం ఏర్పడుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న 50 వాహనాల్లో.. 42 వాహనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఆరు వాహనాలకు షెడ్లు ఉన్నాయి. అలాగే ఇందులో పనిచేసే సిబ్బంది తలదాచుకునేందుకు స్థలం లేకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా ప్రభుత్వ కార్యాలయాల్లోని నిరుపయోగంగా ఉన్న గదుల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. తాగునీటి వసతి, మరుగుదొడ్లూ.. లేకపోవడం వలన మహిళా సిబ్బంది అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

జిల్లాలో 108 వాహనాలు, సిబ్బంది వివరాలు..

మొత్తం వాహనాలు - 50, అందుబాటులో ఉన్నవి - 42, కొత్తవి - 27, డ్రైవర్లు - 125, టెక్నీషియన్లు -125

దాతలు సహకరించాలి..

108 వాహనాలు నిలిపేందుకు ప్రత్యేక షెడ్లు నిర్మించాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి దృష్టికి తీసుకెళ్లాం. దాతలు ముందుకొచ్చి అంబులెన్స్​లు నిలుపుకునేందుకు షెడ్లు నిర్మిస్తే బాగుంటుంది. అలాగే సిబ్బందికి కనీస వసతులు కల్పిస్తే మెరుగైన వైద్య సేవలందించేందుకు వీలుంటుంది.

- గణేష్, 108 వాహనాల జిల్లా మేనేజర్

ఇదీ చదవండి:

నూతన ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠకు ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.