రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటివెలుగు కార్యక్రమం లక్షలాదిమంది చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపుతుందని... ఉపముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో నిర్వహించిన కంటివెలుగు కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. విద్యార్థులకు చేస్తున్న కంటి పరీక్షలను పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా 70లక్షల మంది చిన్నారులకు కంటివెలుగు ద్వారా పరీక్షలు నిర్వహించి... వైద్యం అందిస్తున్నట్లు కాళీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు.
ఇదీ చదవండీ... 'నెల్లూరు జిల్లాలో... ప్రతి ఎకరాకు నీరందిస్తాం'