పశ్చిమగోదావరి జిల్లాలో రెండు రోజులుగా మద్యం దుకాణాలు అన్ని తెరుచుకోవటంతో దుకాణాల వద్ద మందుబాబులు బారులు తీరుతున్నారు. భౌతిక దూరం పాటించకుండా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఇష్టారాజ్యంగా దుకాణాల వద్ద మద్యం కొనుగోలుచేస్తున్నారు. మందు ప్రియులను నియంత్రించేందుకు ఎక్కడా ఎక్సైజ్, ఇతర పోలీసులు కనిపించడంలేదు. ఫలితంగా మద్యం దుకాణాల వద్దకు భారీగా చేరుకుని మద్యం కొంటున్నారు.
జిల్లాలో 385 మద్యం దుకాణాలు ఉండగా... ఇందులో 195 మద్యం దుకాణాలు ప్రారంభంలో తెరుచుకోలేదు. ప్రస్తుతం రెండు రోజుల కిందట రెడ్‌జోన్ పరిధిని కుదించటంతో అన్ని మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. మందుబాబులు ఎండను సైతం లెక్కచేయకుండా, భౌతిక దూరం పాటించకుండా మద్యం కొనుగోలుచేస్తున్నారు.