పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలంలోని పలు గ్రామాలు వరద ముంపు బారిన పడుతున్నాయి. ఉప్పుటేరు, చినకాపవరం డ్రైన్లలో వరద ప్రవాహం... గ్రామాలను ముంచెత్తుతున్నాయి. డ్రైన్ గట్లు పైనుంచి నీరు పొంగి ప్రవహిస్తుండటం వల్ల గ్రామాల్లోకి వరద చేరుతోంది. వరద నీటి ప్రవాహంతో ఆకివీడు మండలంలోని చెరుకుమిల్లి, మందపాడు, దుంపగడప, సిద్ధాపురం, చినకాపవరం, గుమ్ములూరు, అప్పారావుపేట, కోళ్లపర్రు, పెదకాపవరం తదితర గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
మండలంలో సుమారు ఆరు వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగినట్లు అధికారులు అంచనా వేశారు. సుమారు రెండు వేల ఎకరాల్లో ఆక్వా చెరువులు వరద నీటిలో చిక్కుకున్నాయి. చెరువు గట్లు తెగిపోకుండా ఆక్వా రైతులు ఇసుక బస్తాలను కట్టగా కడుతున్నారు. కళింగగూడెం గ్రామ మహిళలు గంగమ్మ శాంతించు అంటూ పూజలు చేశారు.
ఇదీ చదవండి: