పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పంచాయతీరాజ్ కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ కోసి సూర్యచంద్ర దొర అనిశా అధికారులకు పట్టుబడ్డాడు. కొయ్యలగూడెంకు చెందిన ఓ కాంట్రాక్టర్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోగా.. సూర్యచంద్ర రూ. 11 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు అనిశా అధికారులను ఆశ్రయించాడు. సూర్యచంద్ర దొర లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఇదీ చదవండి: జంగారెడ్డిగూడెం సీఐ నాగేశ్వరనాయక్, ఎస్సై గంగాధర్ సస్పెన్షన్