LIVE : వందరోజుల పాలన- తిరుమల లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ - ప్రత్యక్షప్రసారం - CM Chandrababu Press Meet LIVE
🎬 Watch Now: Feature Video
CM Chandrababu Press Meet on Tirumala Laddu Issue Live : తిరుమల లడ్డూ కల్తీపై సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. అంతకుముందు లడ్డూ కల్తీపై టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉండవల్లి నివాసంలో జరిగిన సమావేశంలో టీటీడీ ఈవో, ఆగమ శాస్త్ర పండితులు పాల్గొన్నారు. టీటీడీ ప్రక్షాళన, ఆలయ సంప్రోక్షణకు సంబంధించి ఈవో ఇచ్చిన ప్రాథమిక నివేదికపై సమావేశంలో చర్చించారు. శ్రీవారి ఆలయ సంప్రోక్షణపై ఆగమ సలహాదారులు, వేద పండితుల సూచనలను ఈవో సీఎంకు నివేదించారు. తిరుమలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో సంప్రోక్షణ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశం సందర్భంగా తిరుమల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రికి టీటీడీ అధికారులు ఆహ్వానం పలికారు. అక్టోబర్ నాలుగో తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలంటూ ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఆహ్వాన పత్రిక అందించారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీకి కార్యకర్తలే బలం వారి త్యాగాలను మర్చిపోలేమన్నారు. త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు అంటున్నారని చంద్రబాబు వెల్లడించారు. ప్రస్తుతం తిరుమల లడ్డూ కల్తీపై సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : Sep 22, 2024, 8:28 PM IST