లంచం కోసం డిమాండ్ చేసిన బిల్ కలెక్టర్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నూతనంగా నిర్మించిన గృహానికి.. ఇంటి పన్ను అంచనా వేసి చెప్పాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన గూడూరి శ్రీనివాసరావు 2019లో మున్సిపాలిటీకి దరఖాస్తు చేశాడు. రెండేళ్లుగా కాలయాపన చేసిన బిల్ కలెక్టర్ పెచ్చేటి ఆంజనేయులు లంచం కోసం డిమాండ్ చేయగా.. గూడూరి శ్రీనివాస్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రూ.1500 ఆంజనేయులుకు ఇస్తుండగా ఏలూరు నుంచి వచ్చిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.
ఇదీ చదవండి: ప్రయాణికులపై తేనెటీగల దాడి