రాష్ట్రవ్యాప్తంగా ఏడు వైద్య కళాశాలల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు జిల్లా ఆసుపత్రి ఆవరణలో నిర్మిస్తున్న వైద్యకళాశాలను ఆయన పరిశీలించారు. 22ఎకరాల్లో 210కోట్ల రూపాయలతో ఈ వైద్యకళాశాల నిర్మాణం తలపెట్టినట్లు తెలిపారు. ప్రధాన వైద్యశాల, ఇతర వసతి గృహాలను మంత్రి పరిశీలించారు. రాష్ట్రంలో వైద్య కళాశాలల ఏర్పాటు వల్ల ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుందని మంత్రి అన్నారు.
ఇదీ చూడండి