పశ్చిమ గోదావరి జిల్లా జిలుగుమిల్లి మండలం దర్భగూడెంలో అక్రమ మట్టి రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వ భవనాల పేరుతో అక్రమ మట్టి వ్యాపారం చేస్తూ లక్షలు దోచుకుంటున్నారనే సమాచారం మేరకు ఎస్సై విశ్వనాథ బాబు సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లారు.
నాలుగు ట్రాక్టర్ల స్వాధీనం..
అనంతరం మట్టి తవ్వకాలు చేస్తున్న జేసీబీతో పాటు నాలుగు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని జీలుగుమిల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం ట్రాక్టర్లు, జేసీబీలను రెవెన్యూ అధికారులకు అప్పగించామని ఆయన వివరించారు. తహసీల్దార్ నివేదిక మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.