ETV Bharat / state

జనసేనలో చేరికపై వైసీపీ నేత క్లారిటీ.. ఏమన్నారంటే

YSRCP LEADER JOIN IN JANASENA : పవన్ కల్యాణ్​తో కలసి ప్రయాణించేందుకు నిర్ణయం తీసుకున్నానని విజయనగరం వైసీపీ నేత గురాన అయ్యలు తెలిపారు. ఈ నెల19న హైదరాబాద్​లో పవన్​ను మర్యాదపూర్వకంగా కలిశానని వెల్లడించారు. సుపరిపాలన అందించే ఆయన నాయకత్వాన్ని అందరూ బలపరిచే సమయం ఆసన్నమైందన్నారు.

YSRCP LEADER JOIN IN JANASENA
YSRCP LEADER JOIN IN JANASENA
author img

By

Published : Nov 21, 2022, 5:15 PM IST

Updated : Nov 21, 2022, 7:08 PM IST

YCP LEADER DECIDED TO JOIN IN JANASENA : జనసేన అధినేత పవన్​కల్యాణ్​తో కలిసి ప్రయాణించేందుకు నిర్ణయం తీసుకున్నానని.. త్వరలోనే మంచి ముహూర్తం చూసి ఆ పార్టీలో చేరుతానని విజయనగరానికి చెందిన వైసీపీ నేత, ప్రముఖ వ్యాపారవేత్త గురాన అయ్యలు తెలిపారు. ఈ నెల 19న హైదరాబాద్​లో పవన్ కల్యాణ్​ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు వెల్లడించారు. తాను స్వతహాగా మెగా ఫ్యామిలీకి అభిమానినని, గతంలో ప్రజారాజ్యం పార్టీలో పని చేసినట్లు తెలిపారు.

అన్యాయమైన, స్వార్థపూరిత రాజకీయ పాలనావ్యవస్థను తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. జనసేన సిద్ధాంతాలు, పవన్ కల్యాణ్ పోరాటస్ఫూర్తి, అందరికీ సమన్యాయం, మంచి చేయాలనుకునే పవన్ నాయకత్వం నచ్చిందని తెలిపారు. పవన్ కల్యాణ్ నాయకత్వాన్ని అందరూ బలపరిచే సమయం ఆసన్నమైందని అన్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో పని చేసినవారు, వివిధ పార్టీల్లో కష్టపడినా గుర్తింపు లేనివారు జనసేన పార్టీలో చేరి మద్దతు ఇవ్వాలని కోరారు.

జనసేనలో చేరికపై వైసీపీ నేత క్లారిటీ

ఇవీ చదవండి:

Last Updated : Nov 21, 2022, 7:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.