విజయనగరం జిల్లా గుర్ల మండలంలో మాజీ ఎమ్మెల్యే పెనుమత్స సాంబశివరాజుకు ఉత్తరాంధ్ర విద్యార్థి యువసేన నాయకులు స్మారక సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఎంతో మంది రాజకీయ ఉద్దండులను తయారు చేసిన ఘనత పెనుమత్సకు దక్కుతుందని ఎంపీ పేర్కొన్నారు. రాజకీయాల్లో విలువల గల నాయకుడు, ప్రజా బంధువు సాంబశివరాజు మరణం పార్టీకి తీరని లోటని తెలిపారు.
ఇదీ చదవండి: