ETV Bharat / state

శుభకార్యం జరగాల్సిన ఇంట్లో.. - విజయనగరం జిల్లా సీతానగరంలో రోడ్డు ప్రమాదం

మరో నెల రోజుల్లో ఆ యువకుడు ఓ ఇంటి వాడు అవ్వనున్నాడు. పెళ్లి పనుల నిమిత్తం.. కాబోయే భార్యతో కలిసి ఆ యువకుడు విశాఖకు బయలుదేరాడు. యువతిని ప్రధాన రోడ్డుపై ఉంచి సీతానగరం ఊరులోకి వెళ్లి తిరిగి వస్తుండగా ఆటో ఢీకొట్టింది. ప్రమాదంలో యువకుడు మరణించటంతో.. ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. కాబోయే భార్య, యువకుడి తల్లి రోదనలతో గ్రామలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.

accident, death
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన యువకుడు
author img

By

Published : Apr 5, 2021, 9:19 AM IST

Updated : Apr 5, 2021, 3:58 PM IST

మరో నెల రోజుల్లో ఆ ఇంట్లో శుభకార్యం జరగాల్సి ఉంది. రెండు కుటుంబాలు పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. ఇంతలో జరిగిన రోడ్డు ప్రమాదం ఆ రెండిళ్లలోనూ విషాదాన్ని మిగిల్చింది. విజయనగరం జిల్లా సీతానగరంలో ద్విచక్రవాహనాన్ని ఆటో ఢీకొట్టడంతో యువకుడు దుర్మరణం చెందారు. కొమరాడ మండలం దుగ్గి గ్రామానికి చెందిన పి.జయరాజ్‌(22)కు మే రెండో వారంలో వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో కాబోయే భార్యతో కలిసి విశాఖకు బయలుదేరారు. యువతిని ప్రధాన రోడ్డుపై ఉంచి సీతానగరం ఊరులోకి వెళ్లి తిరిగి వస్తుండగా ఆటో ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడటంతో క్షతగాత్రున్ని పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న యువతి కన్నీరుమున్నీరైంది. ఎస్‌ఐ బి.మురళి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇంటి దీపం ఆరిపోయింది:

జయరాజ్‌కు తండ్రి లేడు. 14 ఏళ్ల వయసులోనే దూరమయ్యారు. తల్లి శాంతి, తమ్ముడు ఉన్నారు. విశాఖలో ప్రైవేటుగా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అంది వచ్చిన కొడుకు, నెల రోజుల్లో ఓ ఇంటి వాడవ్వాల్సిన సమయంలో మృత్యుఒడికి చేరాడంటూ.. ఆ తల్లి రోదనలతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

ఇదీ చదవండి: స్నేహం ముసుగులో యువతి నుంచి రూ. 3.10 లక్షలు స్వాహా

Last Updated : Apr 5, 2021, 3:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.