ETV Bharat / state

వెయిట్‌లిఫ్టింగ్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణింపు - విజయనగరం జిల్లా ప్రధాన వార్తలు

వాళ్లు ఉండేది పల్లెటూరులో....అక్కడ కనీస సౌకర్యాలూ లేవు. కానీ క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణిస్తూ ప్రపంచాన్నే తమవైపు తిప్పుకుంటున్నారు. వెయిట్‌ లిఫ్టింగ్‌లో పతకాల పంట పండిస్తున్నారు. సులువుగా బరువులెత్తుతూ... ప్రభుత్వ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారు. ఈ ఫలితాల వెనుక ఓ సామాన్య శిక్షకుడి ఎనలేని కృషి దాగుంది.

వెయిట్‌లిఫ్టింగ్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణింపు

author img

By

Published : Aug 26, 2021, 5:34 PM IST

వెయిట్ లిప్టింగ్ లో రాణిస్తున్న యువతి యువకులు

చల్లా రాము.. విజయనగరం జిల్లా కొండవెలగాడ నివాసి. పోలియో కారణంగా పుట్టుకతోనే దివ్యాంగుడు అయిన రాము.. 1994లో విజయనగరంలో జరిగిన జాతీయ జూనియర్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలను తిలకించాడు. అక్కడ యువతులు పోటీలో పాల్గొనడం చూసి... తన చెల్లిని వెయిట్‌ లిఫ్టర్‌గా చూడాలని కాంక్షించాడు. తల్లిదండ్రులను ఒప్పించి ఆమెకు విజయనగరంలో ప్రత్యేక శిక్షణ ఇప్పించాడు. ఈ క్రమంలో వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడపై అవగాహన పెంచుకున్న రాము... తన సోదరి జాతీయ క్రీడాకారిణిగా ఎదగడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. కానీ ప్రమాదవశాత్తు చెల్లెలు అకాల మరణంతో రాము కుంగిపోయాడు.

కొంత కాలం తర్వాత కోలుకున్న రాము చెల్లెలు జ్ఞాపకార్ధంగా గ్రామంలోని ఔత్సాహిక యువతులను వెయిట్ లిఫ్టర్లుగా తయారు చేయాలని సంకల్పించాడు. ఇందుకోసం వ్యాయామ ఉపాధ్యాయ కోర్సు బీపెడ్ పూర్తి చేసి... కొందరు వెయిట్ లిప్టింగ్ కోచ్‌ల వద్ద శిక్షణ పొందాడు. అనంతరం 1997లో కొండవెలగాడలో వెయిట్ లిప్టింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించాడు. అనివార్య కారణాల వల్ల కొంత కాలం విరామం తీసుకున్నా 2005 నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా వందల మంది గ్రామీణ యువతీయువకులకు వెయిట్ లిప్టింగ్ క్రీడలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు.

చల్లా రాము వద్ద శిక్షణ పొందిన వారు 2007 నుంచి పతకాల పంట పండించారు. 2009లో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 250మంది రాష్ట్ర స్థాయి, 150మంది జాతీయ స్థాయి, 20మంది వరకు అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించారు. కొందరు వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడలోని ప్రతిభ ఆధారంగా కేంద్ర, రాష్ట్ర కొలువులు సాధించారు. ఇప్పటివరకూ 10మంది ఉన్నతస్థాయి ఉద్యోగం సాధించారు. రాష్ట్రంలో వెయిట్ లిప్టింగ్ అంటే.... కొండవెలగాడ అన్నంత గుర్తింపు తీసుకొచ్చారు.వెయిట్‌లిఫ్టర్లగా తమ పిల్లలు సాధించిన ఘనత చూసి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అరకొర వసతులతోనే.. వెయిట్‌లిఫ్టింగ్‌లో శిక్షణ ఇస్తూ జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారుచేస్తున్న రాము.... ప్రభుత్వం సహాకారం అందిస్తే మరింత మెరుగ్గా... మట్టిలో మాణిక్యాలను తయారుచేస్తానని చెబుతున్నాడు.

ఇదీ చదవండి:

అఫ్గాన్​లో తాలిబన్లను మించిన ఆహార సంక్షోభం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.