తాడి జగదీష్‌ది విజయనగరం జిల్లా సాలూరు మండలం గంగారావు కోట బూర్జి వీధి. ఈ యువకుడు సరదా కోసం శిఖపరువు జలపాతానికి వెళ్లాడు. నీటిలో ఈత కొడుతుండగా తలకి బలంగా రాయి తగిలింది. నొప్పిని భరించలేక నీటిలో మునిగిపోతున్న జగదీష్‌ను గుర్తించిన తోటి యువకులు బయటికి తీసుకొచ్చారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడా యువకుడు. జగదీష్ మృతిపై కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు.
ఇవీ చదవండి