విజయనగరంలో నూతన జాతీయ విద్యావిధానంపై ఆంధ్రప్రదేశ్ అఖిల భారత విద్యాపరిషత్ ఆధ్వర్యంలో వెబినార్ నిర్వహించారు. విజయనగరం సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ , నూతన విద్యావిధాన డ్రాఫ్ట్ కమిటీ మెంబర్ ప్రొఫెసర్ టీవీ కట్టిమని కీలక ప్రసంగం చేశారు. నేటి యువతరానికి మన జాతీయ ఔన్నత్యాన్ని తెలియజేసేవిధంగా నూతన విద్యావిధానాన్ని రూపొందించామని వివరించారు.
విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించి జీవనోపాధికి దోహదపడే విధంగా రూపొందించామని, మన జాతీయ వనరులు నదులు, సముద్రాలు, వృక్షసంపద, జంతుసంపదను పరిరక్షిస్తూ సంపద వృధ్ధి దిశగా విద్యావిధానం రూపొందిందని చెప్పారు. నూతన విధానం విజయవంతం కావాలంటే ఉపాధ్యాయులు అంకితభావంతో కృషి చేయాలని అన్నారు.
ఇదీ చూడండి.