విజయనగరంలోని అరుంధతీ నగర్, అయ్యన్నపేట, బొబ్బాదిపేటల్లో గల వార్డు సచివాలయాలను జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా పౌరసరఫరాల అధికారి పాపారావుతో కలిసి, రేషన్ కార్డుల మాపింగ్, జియో టాగింగ్పై ఆరా తీశారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు, పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల తొలగింపు తదితర సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
ఇదీ చదవండి: