కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు మరింత సమర్థవంతంగా పనిచేయాలని జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ కోరారు. కరోనా పాజిటివ్ వచ్చినవారి డైరెక్ట్ కాంటాక్ట్స్‌ను త్వరగా గుర్తించి పరీక్షించడం ద్వారా, వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని సూచించారు. మరణాల శాతాన్ని ఇంకా తగ్గించాలన్నారు. ప్రతీ కొవిడ్ ఆసుపత్రిలో 24గంటల హెల్ప్ డెస్క్‌లో సిబ్బందిని అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.
రోగికి ఏ సమయంలో ఏ విధమైన వైద్యం, ఇతర సహాయం అవసరమున్నా, దానిని అందించేందుకు హెల్ప్ డెస్కు బాధ్యత తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. కరోనా రోగుల వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసే విషయంలో జాప్యం జరుగుతోందని, దీనిని నివారించేందుకు ప్రతీ ఆసుపత్రికి నలుగురు ఆరోగ్యమిత్రలను నియమించాలని సూచించారు. కొవిడ్ ఆసుపత్రుల్లోని అన్ని పడకలను పూర్తిగా నింపేయకుండా, అత్యవసర రోగులకోసం కనీసం 10శాతం బెడ్స్‌ను కేటాయించాలన్నారు.
ఇదీ చదవండి: