విజయనగరం జిల్లా పార్వతీపురం ఉప కలెక్టర్గా పనిచేస్తున్న చేతన్ సతీమణి రచన వైద్య విద్య పూర్తి చేశారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితిలో పేదలకు స్వచ్ఛందంగా సేవ చేయాలని ముందుకు వచ్చారు. ప్రాంతీయ ఆసుపత్రిలో ఓపీ విభాగంలో రోగులను పరీక్షిస్తున్నారు. ఆసుపత్రులకు వైద్యులు సిబ్బంది అవసరం ఎంతో ఉందన్న విషయాన్ని గుర్తించి తనవంతుగా సేవలందించేందుకు ఆమె ముందుకు రావడం ఆదర్శనీయమని వైద్యులు ప్రశంసిస్తున్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని మరి ఇంత మంది ముందుకు రావాలని సూపరిండెంట్ వాగ్దేవి కోరుతున్నారు.
ఇదీ చూడండి లాక్డౌన్' ఉల్లంఘిస్తే ఒక్కరి నుంచే 406 మందికి కరోనా!