విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం కొట్టాడ గ్రామంలో ముకుంద సాగరం చెరువులో అక్రమంగా నిల్వ చేసిన 1247 టన్నుల ఇసుకను పోలీసులు పట్టుకున్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దాడి చేసింది.
స్థానిక రైతులు ఇసుకను సేకరించి ట్రాక్టర్లు, లారీ లకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని అదనపు ఎస్పీ శ్రీదేవి రావు చెప్పారు. ఇసుక, మద్యం, రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు.