ETV Bharat / state

విజయనగరానికి ఫొని భయం... కురుస్తున్న వర్షాలు - toofan

విజయనగరం జిల్లాలో ఫొని ప్రభావం కనిపిస్తుంది. ఆకాశం మేఘావృతంగా మారింది. అక్కడక్కడా చిరుజల్లులు ముదలైనాయి. కలెక్టర్​ ఆదేశాలతో అధికారులు ప్రజలను, తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులను పునరావాస కేంద్రాలకు తరలించారు. నేడు, రేపు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ, విపత్తు శాఖలు పేర్కొన్నాయి. తీరంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. సహాయక బృందాలను తీర ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచారు.

అక్కడక్కడా కురుస్తున్న వర్షాలు
author img

By

Published : May 2, 2019, 4:05 PM IST

విజయనగరానికి ఫొని భయం!

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫొని ప్రభావంతో విజయనగరం జిల్లా పరిధిలోని సముద్ర తీరప్రాంతం చిగురుటాకులా వణికిపోతోంది. దూసుకొస్తున్న ఫొని తుపాను ఏం చేస్తుందోనని, ముంచుకొచ్చే విపత్తు ఏ నష్టం మిగులుస్తుందోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఫొనిని ఎదుర్కొనేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినా... ప్రధానంగా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
విజయనగరం జిల్లావ్యాప్తంగా ఆకాశం మేఘావృతంగా మారింది. గాలుల ఉద్ధృతి పెరిగింది. భోగాపురం, పూసపాటిరేగ తీర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. నేడు, రేపు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ, విపత్తుల శాఖలు పేర్కొన్నాయి. ఫొని తీరం దాటే సమయంలో జిల్లాలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని తీర ప్రాంతాలపై తుపాను ప్రభావం... నష్ట నివారణలో భాగంగా తీసుకున్న ముందస్తు చర్యలను భోగాపురం మండలం తీర ప్రాంత ప్రత్యేక అధికారి నాగేశ్వరరావు తెలిపారు.
ఫొని తుపాను కారణంగా జిల్లాలో అక్కడక్కడ ఉదయం నుంచి చిరు జల్లులుతో కూడిన వాన కురుస్తోంది. ఉదయం నుంచి ఆకాశం మేఘాలు కమ్ముకొని ఉంది. చిరుజల్లులు కురవడంతో రహదారులు వర్షపు నీటితో తడిసాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఫొని తుఫాను ఉద్ధృతం దాల్చింది. విజయనగరం జిల్లా భోగాపురం పూసపాటిరేగ మండలాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. నేటి ఉదయం నుంచి ఎన్డీఆర్ఎఫ్ పోలీస్ రెవెన్యూ బృందాలు భోగాపురం తీర ప్రాంత గ్రామాలు చేపలచేరు, రాజపాలెం ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. సుమారు 40 మీటర్ల మేర సముద్రపు అలలు చొచ్చుకొచ్చాయి. దీంతో ఆయా తీర ప్రాంతాలు మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. పెథాయి తుఫాను వచ్చి మూడు నెలలు గడవక ముందే ఈ ఫొని తుఫాన్​ రావడంతో భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆయా గ్రామాల్లో పర్యటించి మత్స్యకారులను అప్రమత్తం చేస్తున్నారు. తహసీల్దార్ గంగాధరరావుతో పాటు ఆయా ప్రాంతాలను పర్యటించి అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి...రేపు మధ్యాహ్నానికి తీరం దాటనున్న ఫొని

Intro:కిట్ నం: 879, విశాఖ సిటీ, ఎం.డి.అబ్దుల్లా.

విశాఖ నగరంలో హమాలీలు, అసంఘటిత రంగ కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో విశాఖ సరస్వతి పార్క్ నుంచి దాబా గార్డెన్స్ మీదుగా సిటీ సెంట్రల్ పార్క్ వరకు కార్మికుల ర్యాలీ సాగింది అనంతరం జరిగిన బహిరంగ సభలో కార్మిక నాయకులు పాల్గొన్నారు.

Body:ఈ సందర్భంగా ర్యాలీలో నీటి ఎద్దడి ,మతోన్మాదం వంటి అంశాలను తెలియజేసే పెద్ద అ బొమ్మలను ప్రదర్శించారు. కార్మికుల బహిరంగ సభ ముందుగా బాలలు మేడే కార్మిక గీతానికి నృత్యం చేశారు.

Conclusion:ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసే అనేక చట్టాలను ముందుకు తెలుస్తోందని, చారిత్రక ఉద్యమాల అనంతరం కార్మికుల సాధించుకున్న హక్కులను హరించే చర్యలను కార్మిక రంగం తిప్పి కొడుతుందని స్పష్టం చేశారు.

బైట్: సి.హెచ్.నరసింగరావు, రాష్ట్ర అధ్యక్షుడు, సి.ఐ.టి.యు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.