ETV Bharat / state

రేషన్ అందజేతలో సాంకేతిక సమస్య.. అర్థరాత్రి వరకూ పంపిణీ! - విజయనగరం జిల్లా తాాజా వార్తలు

ఇంటింటికీ వాహనం ద్వారా రేషన్ పంపిణీ చేసే విధానం అస్తవ్యస్తంగా సాగుతోంది. అనేక లోపాలతో కూడిన ఈ ప్రక్రియ కారణంగా.. నెలల తరబడి పేదలకు సరుకులు అందడం లేదు. రాష్ట్రంలోని పలు మండలాల్లోని ప్రజలు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ration goods
వాహనం ద్వారా రేషన్ పంపిణీ
author img

By

Published : Apr 7, 2021, 2:54 PM IST

విజయనగరం జిల్లా భోగాపురం మేజర్ పంచాయతీల్లో రేషన్​ సరుకులు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు నెలలుగా రేషన్​ సరుకులు అందటం లేదని విచారం వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులకు విన్నవించగా.. వారు నిన్న సాయంత్రం వాహనాన్ని బీసీ కాలనీకి పంపించారు.

కానీ... సిగ్నల్ సమస్యలతో గంటలకొద్దీ లబ్ధిదారులు క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. తహాసీల్దార్​ రాజేశ్వరరావు వచ్చి వాహనాన్ని మరోచోటుకు మార్చినా.. సంకేతిక సమస్యలు పరిష్కారం అవ్వలేదు. ఈ కారణంగా అర్ధరాత్రి వరకు సరుకుల పంపిణీ కొనసాగింది.

ఇదీ చదవండి:

మాచర్ల ఆస్పత్రి ఎదుట మృతుడి బంధువుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.