విజయనగరం జిల్లాలో కరోనా వ్యాధిని కట్టడి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ తెలిపారు. ఒకవైపు కరోనా నియంత్రణకు చర్యలను తీసుకుంటూనే, వ్యాధి సోకినవారికి చికిత్స చేసేందుకు ఆసుపత్రులను కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు.
మొత్తం 1385 పడకలతో 7 ఆస్పత్రులను ఏర్పాటు చేశామని వెల్లడించారు. పరిస్థితిని బట్టి కరోనా బాధితులను ఆస్పత్రుల్లో చేర్చుతున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ భౌతికదూరాన్ని పాటించాలని సూచించారు.
ఇదీ చదవండి: