విజయనగరం జిల్లాలో గిరిజన గ్రామాల్లో విషజ్వరాల వ్యాప్తి కొనసాగుతోంది. సాలూరు,మామిడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఐదుగురు వ్యక్తులకు విషజ్వరాలతో ప్లేట్ లెట్స్ పడిపోవడంతో బాధితులను విజయనగరానికి తరలించారు. 30 ఏళ్ల వ్యక్తికి విజయనగరం కేంద్ర ఆసుపత్రిలో డెంగీ నిర్ధారణ కావడంతో విశాఖ కేజీహెచ్ కు పంపించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రాంతానికి చెందిన ఆరేళ్ల బాలుడికి అతని తండ్రికి విషజ్వరం సోకడంతో విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే కుటుంబానికి చెందిన 15 ఏళ్ల బాలికకు వారం రోజుల క్రితం వరకు అదే ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ప్లేట్ లెట్స్ పడిపోగా ఒక్క బాలిక వైద్యానికి ఒక లక్షా 50 వేల రూపాయలు ఖర్చు అయిందని కుటుంభీకులు చెప్పారు.
ఇదీ చూడండి