ETV Bharat / state

ప్రతిపక్ష హోదా కావాలని శాసిస్తారా? - అది ప్రజలే ఇవ్వాలి:సీఎం చంద్రబాబు - CHANDRABABU COUNTER TO JAGAN

ప్రతిపక్ష హోదాపై జగన్‌ తీరును నిలదీసిన సీఎం చంద్రబాబు - ఆ హోదా కావాలని శాసిస్తారా? అని ధ్వజం

CM Chandrababu About Jagan Opposition Status
CM Chandrababu About Jagan Opposition Status (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 15, 2024, 7:13 AM IST

CM Chandrababu About Jagan Opposition Status : 'వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌కు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. అది మనం అడిగితే వచ్చేది కాదు. ఒకరికి అధికారం ఇవ్వాలన్నా, ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నా అది ప్రజలే ఇవ్వాలి. శాసనసభలో ఉన్న మొత్తం స్థానాల్లో పది శాతం స్థానాలు గెలుచుకుంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ప్రజలు ఆయన పాలన చూసి 11 సీట్లే ఇచ్చారు. ఆయన అహంకారం చూడండి. ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేస్తున్నారు. డిక్టేట్‌ చేస్తున్నారు. శాసించాలని అకుంటున్నారు. ప్రతిపక్ష హోదా రాలేదని శాసనసభకు రాను అనేవారు ఎక్కడైనా ఉంటారా? అలాంటి వ్యక్తిని ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా చూస్తామా' అని సీఎం నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.

రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్​గా ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు గురువారం ఎన్నికైన సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. తొలుత ఈ ఎన్నిక విషయాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. అనంతరం సభాపతితో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, మంత్రులు సత్య కుమార్, బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు విష్ణు కుమార్‌ రాజు, మంత్రి అచ్చెన్నాయుడు తదితరులు రఘురామకృష్ణరాజును వెంటబెట్టుకుని వెళ్లి సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన వద్దకు వెళ్లి అభినందించారు. అనంతరం రఘురామను అభినందిస్తూ అంతా మాట్లాడారు.

ఆ ఇద్దరూ ఉన్నారు : ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజుతో వ్యవహరించిన తీరు, ఆయనను పోలీసు కస్టడీలో హింసించిన వ్యవహారం అధితర అంశాలను ప్రస్తావించారు. నాడు జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని ఆయన ఎలా వేధించారో, ఎలా ఇబ్బందులు పెట్టారో కూడా వివరించారు. 'అయ్యన్నపాత్రుడు 1983 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనపై జగన్‌ అత్యాచారయత్నం కేసు పెట్టించి వేధించారు. నరసాపురం నుంచి వైఎస్సార్సీపీ ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు ఆయనతో విభేదించినందుకు ఆయనను చంపేయాలని కుట్ర పన్నారు. ఆయన గట్టి పోరాటం చేశారు. ఇప్పుడు ఆ ఇద్దరూ స్పీకర్​గా, డిప్యూటీ స్పీకర్​గా ఉన్నారు. వారి ముందు కూర్చునేందుకు కూడా జగన్‌ ఇష్టపడని పరిస్థితిని ప్రజాస్వామ్యం కల్పించింది' అని చంద్రబాబు అన్నారు.

గత ఐదేళ్లలో 227 ఎంవోయూలు - పైసా పెట్టుబడి రాలేదు: సీఎం చంద్రబాబు

సినిమాల్లో పవన్‌ కల్యాణ్‌ ఎంత సంచలనమో, రఘురామకు అంతే క్రేజ్‌ రాజకీయాల్లో ఉందని, ఆయన నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం అంత పేరు తెచ్చిపెట్టిందని అన్నారు. పోలీసు కస్టడీలో రఘురామను హింసించడం, సుప్రీంకోర్టు వరకు ఈ అంశం వెళ్లడం తదితర పరిణామాలన్నింటినీ చంద్రబాబు వివరించారు.

చెబితే చావు తప్పించుకోలేవు : 'ప్రభుత్వమే టెర్రరిజం సృష్టించడం జగన్‌ పాలనలోనే జరిగింది. ఆయన తన సొంత పార్టీ ఎంపీపైనే కక్షగట్టి కుట్ర పన్ని చంపేందుకు వెనకాడని విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. రఘురామ పుట్టిన రోజు నాడే 2021లో రాజద్రోహం కేసు పెట్టారు. ఉదయం 9 గంటలకు ఫిర్యాదు, 10 గంటలకు ఎఫ్‌ఐఆర్‌ మధ్యాహ్నం 2 గంటలకు అరెస్టు. అదీ శుక్రవారం. ఆ రోజు రాత్రి గుంటూరు సీఐడీ కార్యాలయంలో ఐదుగురు వ్యక్తులు ముసుగులు ధరించి వచ్చి కాళ్లు కట్టేసి లాఠీలు, రబ్బరు బెల్టుతో దాడి చేశారు. మర్నాడు సాయంత్రం గుంటూరు కోర్టులో హాజరు పరుస్తూ కస్టడీలో కొట్టిన విషయం చెబితే చావు తప్పించుకోలేవని బెదిరించారు.

ఆసుపత్రికి తీసుకువెళ్లి పరిశీలించి నివేదిక ఇవ్వాలని మేజిస్ట్రేట్‌ ఆదేశించారు. మే 16న హైకోర్టులోనూ దీనిపై విచారణ జరిగింది. దాడిపై రిపోర్టు ఇవ్వాలని కోర్టు చెప్పినా ఇవ్వలేదు. సాయంత్రం ఆరు గంటలకు రిపోర్టులో మార్పులు చేసి ఇవ్వడంతో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వయంగా రఘురామను తీసుకురమ్మని చెబితే జైలులో పెట్టాం, ఇప్పుడు తీసుకురాలేం అని చెప్పారు. మరో వైపు సుప్రీంకోర్టులో వెకేషన్‌ బెంచి మే 17న కొలువుదీరి రఘురామను హైదరాబాద్‌లోని సైనికాసుపత్రికి తరలించి పరీక్షలు చేయించాలని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ నియమించిన న్యాయాధికారి సమక్షంలో పరీక్షలు నిర్వహించి మంగళవారం నాటికి రిపోర్టు ఇవ్వాలని సోమవారం ఆదేశాలు ఇచ్చారు.

దిల్లీకి సీఎం చంద్రబాబు - కేంద్ర మంత్రులతో భేటీ తర్వాత ఎన్నికల ప్రచారానికి

అయితే సోమవారం సాయంత్రం వరకు ఆయనను జిల్లా జైలు నుంచి విడుదల చేయలేదు. మళ్లీ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ ఆగ్రహం వ్యక్తం చేసి ఎంపీని విడుదల చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత సైనికాసుపత్రి వైద్యులు ఇచ్చిన నివేదినక చూసి సుప్రీంకోర్టు 3 రోజుల్లో బెయిల్‌ ఇచ్చింది. ఆ తర్వాత కూడా నియంతలో మార్పు రాలేదు' అని సీఎం అన్నారు.

ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీ వస్తున్నారని ఎంపీ రఘురామ భీమవరం బయలుదేరారు. ఆయన సొంత నియోజకవర్గానికి కూడా రానివ్వకుండా అప్పటి పాలకులు ఆయనను ఆ రైల్లోనే చంపేందుకు కుట్ర పన్నిన విషయం తెలుసుకుని ఆయన బేగంపేట రైల్వేస్టేషన్‌లో రైలు దిగిపోయారు' అని చంద్రబాబు గుర్తు చేశారు.

'ఆ రోజు జగన్‌ మిమ్మల్ని నరసాపురం లోక్‌సభ నియోజకవర్గానికి రాకుండా అడ్డుకున్నారు. అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికీ రానివ్వలేదు. అలాంటిది మీరు ఉపసభాపతిగా ఉన్న ఈ సభలోకి ఆయన (జగన్) రాలేకపోతున్నారు. మీ ముందు సభలో కూర్చోలేని పరిస్థితి ఆయనకు వచ్చింది. ప్రజాస్వామ్యమంటే ఇదీ. దేవుడు రాసిన స్క్రిప్టు ఇది.' :- డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు

'ఆ రోజు పోలీసు కస్టడీలో రఘురామను ముసుగు వేసుకుని నలుగురు వ్యక్తులు కొట్టారు. రబ్బరు బెల్ట్‌తో, లాఠీలతో, అరికాళ్లపై కొట్టారు. ఇదంతా ఫోన్లో వీడియోకాల్‌లో నాటి ముఖ్యమంత్రి జగన్‌ చూశారని రఘురామ అప్పట్లో చెప్పారు. నిజంగా ఇలా జరిగి ఉంటుందా అని అనుకున్నా. కానీ నన్ను రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో ఉంచి ఆ గదిలో సీసీ కెమెరాలు పెట్టారు. నా హావభావాలు జగన్‌ చూసేందుకే ఆ పని చేశారని తెలిసింది. అప్పుడు నా అనుమానాలు నివృత్తి అయ్యాయి. జగన్‌ ప్రవృత్తి రూఢి అయింది.' :- సీఎం చంద్రబాబు

అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్​గా రఘురామకృష్ణరాజు ఏకగ్రీవ ఎన్నిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.