ETV Bharat / state

వైఎస్సార్సీపీ 'సోషల్‌' సైకోలపై గురి - త్వరలోనే వారందరికీ 41 ఏ నోటీసులు

వర్రా రవీందర్‌రెడ్డి వాంగ్మూలంతో వెలుగులోకి వచ్చిన వారికి త్వరలో 41-A నోటీసులు

VARRA_RAVINDER_REDDY_CASE
VARRA_RAVINDER_REDDY_CASE (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

YSRCP Social Media Activist Varra Ravinder Reddy Case : అధికార పార్టీ ముఖ్యనేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వైఎస్సార్సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలను విచారించడానికి కడప పోలీసుశాఖ సిద్ధమవుతోంది. వర్రా రవీందర్‌రెడ్డి అరెస్ట్‌తో వెలుగుచూసిన ఆ పార్టీ కార్యకర్తలకు 41-A నోటీసులు ఇవ్వనున్నారు. ఇప్పటికే జిల్లాలో పలువురికి నోటీసులు ఇచ్చారు. వర్రా రవీందర్ రెడ్డి వద్ద నుంచి సీజ్ చేసిన సోషల్‌ మీడియా పేజీల వారీగా కార్యకర్తలకు నోటీసులు ఇవ్వనున్నారు. అదే సమయంలో వర్రా రవీందర్ రెడ్డిపై కేసుల పరంపర కొనసాగుతోంది.

వైఎస్సార్సీపీ కార్యకర్తల గుండెల్లో గుబులు : ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్‌తో వైఎస్సార్సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ నెల 8న వర్రా రవీందర్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిలపై ఐటీ యాక్టు, బీఎన్​ఎస్​ (BNS) యాక్టు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు కింద పోలీసులు వివిధ సెక్షన్లు పెట్టి కేసులు నమోదు చేశారు. వర్రా రవీందర్‌రెడ్డిపై నందలూరు పోలీస్ స్టేషన్‌లో మరో అట్రాసిటీ కేసు నమోదైంది. జిల్లాలోని రాజంపేట, కడప తాలూకా, చిన్నచౌకు, జమ్మలమడుగు, ముద్దనూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో 10 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇతనిపై 40 వరకు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. వర్రా వాంగ్మూలం ఆధారంగా 45 మంది వైఎస్సార్సీపీ సామాజిక మాధ్యమ కార్యకర్తలపై కేసులు పెట్టి విచారించేందుకు సిద్ధమవుతున్నారు.

అవినాష్​రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఎక్కడ? - జల్లెడ పడుతున్న పులివెందుల పోలీసులు

పలువురికి నోటీసులు జారీ : 2012లో వైఎస్సార్సీపీ సామాజిక మాధ్యమ రాష్ట్ర కోఆర్డినేటర్ గుర్రంపాటి దేవేంద్రరెడ్డి ఆధ్వర్యంలో పనిచేసిన కొందరు సామాజిక మాధ్యమ కార్యకర్తలను పోలీసులు గుర్తించారు. 2019లో వైఎస్సార్సీపీ సోషల్‌ మీడియా రాష్ట్ర స్థాయి బాధ్యతలు చేపట్టిన ఐ డ్రీం ఛానల్ ఛైర్మన్ చిన్న వాసుదేవరెడ్డి ఏపీ డిజిటల్ మీడియా కార్పొరేషన్ బాధ్యతలు చేపట్టి వైఎస్సార్సీపీ సోషియల్ మీడియాకు పనిచేశారు. వారి 65 మంది టీమ్‌లో కీలకంగా పనిచేసిన 12 మంది పార్టీ కార్యకర్తల పేర్లను సేకరించారు. అదే విధంగా 2022లో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా రాష్ట్ర స్థాయి బాధ్యతలు చేపట్టిన సజ్జల భార్గవ్ రెడ్డి హయంలో అసభ్యకరమైన పోస్టులు పెట్టి, ఫొటోలు మార్ఫింగ్ చేసే మరికొందరు కార్యకర్తలకు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు.

ఎంపీ అవినాష్ చెబితేనే రాఘవరెడ్డి నోట్ చేసుకొని వర్రాకు ఇచ్చాడు : డీఐజీ కోయ ప్రవీణ్‌

త్వరలో 41-A నోటీసులు : వ్యక్తిగతంగా య్యూటూబ్ ఛానల్స్ నడుపుతూ వైఎస్సార్సీపీకి అనుకూలంగా, తెలుగుదేశం పార్టీ అగ్రనేతలకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వారి య్యూటూబ్ ఛానల్స్ పేర్లనూ పోలీసులు సేకరించారు. వారిందరికీ వ్యక్తిగతంగా 41-A నోటీసులు ఇవ్వనున్నారు. వీరిలో కొందరు సినిమా నటీమణులు, మాజీ జర్నలిస్టులు, మీడియా ఛానల్స్ అధిపతులు ఉన్నారు. ఇప్పటికే కడప జిల్లాలో ఉన్న 26 మంది వైఎస్సార్సీపీ సామాజిక మాధ్యమ కార్యకర్తల్లో సగం మందికి 41-A నోటీసులు అందజేశారు. విచారణకు ఎపుడు పిలిచినా రావాలని సూచించారు.

వర్రాపై కేసుల పరంపర : వర్రా రవీందర్ రెడ్డి ఫేస్ బుక్ నుంచి 43 పేజీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అధికార పార్టీ నేతలు, వారి కుటుంబ సభ్యుల మార్ఫింగ్ ఫొటోలతో కూడిన అసభ్యకరమైన పోస్టులే వీటిలో ఎక్కువగా ఉన్నాయి. అసభ్యకరమైన పోస్టులను పరిశీలించిన తర్వాత ఎవరు కంటెంట్ ఇస్తే ఎవరు పోస్టు చేశారనే దానిపై విచారించేందుకు పోలీసులు సంబంధిత వైఎస్సార్సీపీ కార్యకర్తలకు నోటీసులు ఇవ్వనున్నారు. రాష్ట్రస్థాయి వైఎస్సార్సీపీ సామాజిక మాధ్యమ బాధ్యతలు చూస్తున్న సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, వీరారెడ్డి, సుమారెడ్డి లాంటి వాళ్లు కార్యకర్తల ఐడీలు తమ వద్దే పెట్టుకుని ప్రత్యర్థులపై పోస్టులు పెట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వీటన్నిటిపై సమగ్ర విచారణ చేయడానికి కార్యకర్తలను పోలీసుశాఖ విచారణకు పిలిచే అవకాశముంది.

వర్రా రవీందర్‌రెడ్డికి ఆ పార్టీ నుంచే ప్రాణహాని : బీటెక్ రవి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.