రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాలకు వేసిన అధికార పార్టీ రంగులను తొలగించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. వాటి స్థానంలో తెలుపు రంగు వేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజల విజయానికి మొదటి మెట్టు అని విజయనగరం జిల్లా తెదేపా అధ్యక్షులు మహంతి చిన్నంనాయుడు పేర్కొన్నారు.
గ్రామ సచివాలయాలు, పంచాయతీ, సామాజిక భవనాలు, నీళ్ల ట్యాంకులు, దిశా పోలీస్‌స్టేషన్లు, శ్మశానాలు, చెత్త కుండీలకు వైకాపా రంగులు వేసి రూ.1300 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, ఈ మొత్తాన్ని ఆ పార్టీ నుంచి రాబట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మళ్లీ భవనాలకు తెలుపు రంగు వేసేందుకు నిధులను జగన్‌మొహన్‌రెడ్డి జేబు నుంచి ఖర్చు పెడతారా...? అని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయం అంటే ప్రజల సమస్యను పరిష్కరించే దేవాలయం. అన్ని వర్గాల వారు, అన్ని పార్టీల వారు వెళ్లే విజయానికి మొదటి మెట్టు అని జిల్లా తెదేపా అధ్యక్షులు మహంతి చిన్నంనాయుడు ఆదివారం పూసపాటిరేగ మండలంలోని రెల్లివలసలో మాట్లాడారు.
ఇదీ చదవండి :