విజయనగరం పట్టణ తెదేపా ఎస్సీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి ఎస్సీలపై దాడులు పెరిగాయన్నారు. ఎస్సీలపై దాడులు జరుగుతుంటే... చర్యలు తీసుకోకపోవడం సరికాదన్నారు. అలాగే ఎస్సీల భూములను లాక్కోవడం జరుగుతుందని, వారిపై కక్ష సాధింపు ఎందుకని ప్రశ్నించారు. ఇప్పటికైనా తమపై దాడులు ఆపకపోతే ఎస్సీ సంఘాలు కలిసికట్టుగా సీఎంకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఇదీ చదవండి :