ETV Bharat / state

'అధ్వాన్నంగా తయారైన రోడ్లతో ప్రజలకు అవస్థలు'

జిల్లాలో రోడ్లు సరిగ్గా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆప్​ జిల్లా కన్వీనర్​ దయానంద్​ అన్నారు. ఎత్తు బ్రిడ్జ్​ దిగువన ఈ సందర్భంగా తమ నిరసన తెలిపారు. తక్షణమే రోడ్లన్నీ బాగు చేయాలని డిమాండ్​ చేశారు.

vijayangaram district aap leaders protest at bridge road
విజయనగరంలో ఆప్​ నాయకుల నిరసన
author img

By

Published : Oct 31, 2020, 12:48 AM IST

విజయనగరం జిల్లాలో అధ్వాన్నంగా తయారైన రోడ్లతో ప్రజలంతా అవస్థలు పడుతున్నా... ఎమ్మెల్యేలు, అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ దయానంద్ అన్నారు. విజయనగరంలో ఎత్తు బ్రిడ్జి దిగువన నిరసన తెలిపారు. ఎత్తు బ్రిడ్జి నుండి ఆర్ అండ్​ బీ వైపు వెళ్లే రోడ్డు బాగు చేయాలని కోరారు. ఏడాది క్రితం ఆప్​ పోరాటం చేసినప్పుడు.... ఎమ్మెల్యేలు స్పందించి మరమ్మతులు చేపట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ నాణ్యమైన రోడ్డు వేయక సంవత్సరం తిరగక ముందే రోడ్డు పాడై ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని వాపోయారు. అంతేకాకుండా విజయనగరం నుంచి పార్వతీపురం వరకు ఉన్న రోడ్డు నరకాన్ని తలపిస్తుందని ఆవేదన చెందారు. తక్షణమే జిల్లాలో రోడ్లన్నీ బాగుచేసి.. భారీ జరిమానాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి :

వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు... గ్రామస్థుల ఇక్కట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.