విజయనగరంలో నిత్యావసరాలు, కూరగాయలు విక్రయించే ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చేపల మార్కెట్‌ను జిల్లా ఎస్పీ బి.రాజకుమారి పరిశీలించారు. వస్తువులను కొనుగోలు చేసే సమయంలో ప్రజలు సామాజిక దూరాన్ని పాటించే విధంగా అవగాహన కల్పించారు. కరోనా వైరస్ పట్ల ప్రజలకు అవగాహన వచ్చిందని, రైతు బజార్ల వద్ద క్యూలైన్లో వెళ్తూ బాధ్యతగా వ్యవహరిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి రైతు బజార్ వద్ద పోలీసులను నియమించి, వ్యక్తుల మధ్య దూరం ఉండే విధంగా చూస్తున్నామన్నారు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నోరు, ముక్కు నుంచి వచ్చే తుంపర్లు ఎదుటివారిపై పడి కరోనా వ్యాప్తి చెందుతున్నందున చేతి రుమాలును అడ్డం పెట్టుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని రైతు బజార్లు, నూతనంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద గడులను ఏర్పాటు చేసి, వాటిలో నిలబడి వస్తువులను కొనుగోలు చేసుకునే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు.
ఇదీ చదవండి.