ETV Bharat / state

'అధైర్య పడొద్దు... సంసిద్ధంగా ఉన్నాం' - కరోనాపై విజయనగరం కలెక్టర్ సూచనలు

కరోనా సోకితే అధైర్య పడవద్దనీ... విజయనగరం జిల్లా కలెక్టర్ అన్నారు. చికిత్స అందించేందుకు అన్ని విధాలా సంసిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. విజయనగరం ప్రజలంతా స్వచ్ఛంద లాక్​డౌన్​కు పాటించి... కరోనా మహమ్మారి కట్టడికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

vijayanagaram collector on corona
విజయనగరం జిల్లా కలెక్టర్
author img

By

Published : Jul 21, 2020, 8:30 PM IST

విజయనగరం జిల్లాలో కరోనా వైరస్ రోజురోజుకి తీవ్రమవుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం. హరి జవరహర్​లాల్ తెలిపారు. ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. భౌతిక దూరం పాటిస్తూ... తరచూ చేతులను సబ్బుతో శుభ్రపరుచుకోవటం ద్వారా వైరస్ బారిన పడకుండా ఉండవచ్చునని సూచించారు.

ఒకవేళ కొవిడ్ సోకినా అధైర్య పడవద్దనీ.. చికిత్స అందించేందుకు అన్నివిధాలా సంసిద్ధంగా ఉన్నామని భరోసానిచ్చారు. ప్రజలందరి సహకారంతోనే 48 రోజుల పాటు జిల్లాను గ్రీన్​జోన్​గా ఉంచగలిగామని గుర్తు చేసుకున్నారు.

అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛంద లాక్​డౌన్​కు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. రోజుకు రెండువేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ... ఎటువంటి లక్షణాలు లేని బాధితులకు ఇంట్లోనే చికిత్స అందిస్తామని తెలిపారు. హోమ్ ఐసోలేషన్​లో ఉన్న వారికి ప్రత్యేక వైద్య బృందాల ద్వారా చికిత్స అందిస్తామని వెల్లడించారు.

వైరస్ లక్షణాలు ఎక్కువ ఉన్నవారిని కొవిడ్ కేర్ సెంటర్లకు తరలిస్తామనీ... జిల్లావ్యాప్తంగా 3030 పడకలతో కరోనా కేర్ సెంటర్లు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి కరోనా సోకితే...వారిని మాత్రమే కరోనా ఆసుపత్రికి తరలిస్తున్నట్లు స్పష్టం చేశారు.

కరోనాకు సంబంధించిన ఫిర్యాదులు, ఏమైనా సమస్యలు తెలియజేయాలనుకునే వారు కంట్రోల్ రూము నెంబరు 08922-236947 కు ఫోన్ చేయాలని సూచించారు.

జిల్లాలో కరోనాను కట్టడి చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. దీనిలో భాగంగా అమలవుతున్న స్వచ్ఛంద లాక్​డౌన్​కు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: ఆ ఐదు జిల్లాల్లో కరోనా విజృంభణ... రికార్డు స్థాయిలో కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.