విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం రావాడ గ్రామం వద్ద ఉన్న వట్టిగడ్డ ప్రాజెక్టును ఆధునీకరించనున్నట్లు ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి తెలిపారు. ఇందుకోసం రూ. 44. 85 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. రావాడలో ఆమె మాట్లాడుతూ.. చివరి ఆయకట్టుకు కూడా నీరు అందేలా ప్రాజెక్టును ఆధునీకరిస్తామని చెప్పారు. గత ప్రభుత్వాలు వట్టిగడ్డను నిర్లక్ష్యం చేశాయని.. అందువల్ల సాగునీరు అందని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.
తమ ప్రభుత్వం జపాన్ సహకారంతో అమలు చేస్తున్న జైకా పథకంలో భాగంగా ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. సీఎం జగన్ వ్యవసాయ రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు పేర్కొన్నారు. ఆధునీకరణ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ త్వరలోనే చేపడతామని అన్నారు. ఈ ప్రాజెక్టు కింద 16,684 ఎకరాలు ఉన్నాయని.. నిర్ణీత సమయంలో పనులు పూర్తిచేసి చివరి ఆయకట్టుకూ నీరందిస్తామని వివరించారు.
ఇవీ చదవండి...
తెదేపా, వైకాపా వర్గీయులు కర్రలతో దాడి..ఐదుగురికి తీవ్ర గాయాలు