విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమ పాఠశాలలో ఖాళీగా ఉన్న వివిధ ఒప్పంద ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 14ను తుది గడువుగా నిర్ణయించారు. ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి టెట్లో అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. షెడ్యూల్ ప్రాంత ఖాళీలకు స్థానిక అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. క్రీడలు అనుభవం తదితర అంశాలకు ప్రత్యేక మార్కులు ఉంటాయని పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అధిక సంఖ్యలో నిరుద్యోగులు బారులు తీరారు.
ఇవీ చూడండి: