ETV Bharat / state

తప్పని తిప్పలు... డోలిలో ఆసుపత్రికి గర్భిణి - tribals problems in andhrapradesh

గిరిజనులకు డోలీ కష్టాలు తీరటం లేదు. సరైన రోడ్డు మార్గాలు లేకపోవటంతో కొండ ప్రాంతాల్లోని గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా పురిటినొప్పులు వచ్చిన ఓ మహిళను డోలీలో మోసుకుంటూ ఆసుపత్రికి తరలించారు.

doli
doli
author img

By

Published : Nov 13, 2020, 6:08 PM IST

సరైన రవాణా సౌకర్యాలు లేకపోవటంతో విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంపంగిపాడు పంచాయతీ కాగురూడి గ్రామంలోని జన్ని చిన్నమ్మ అనే గర్భిణికి శుక్రవారం పురిటి నొప్పులు వచ్చాయి. సరైన రోడ్డు మార్గం లేకపోవటంతో గ్రామస్థులు డోలి కట్టి ఒడిశాలోని రాళ్లగడ్డ సంత కూడలికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి వాహనంలో సాలూరు సీహెచ్​సీకి తరలించారు. ఆమెకు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉండటంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చదవండి

సీఎం ఆదేశాలు పాటించండి... నేతలకు విజయసాయి సూచన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.